: దీక్షా స్థలిని మార్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్ విస్పష్ట ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టే తీరతానని వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాక గుంటూరులో ఎంపిక చేసిన దీక్షా స్థలిని మార్చే ప్రసక్తే లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు పార్టీ నేతలతో జరిగిన భేటీలో ఆయన విస్పష్ట ప్రకటన చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న జగన్ గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు గుంటూరు ఎస్పీ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన దీక్షకు అడ్డు చెబుతోందని భావిస్తున్న జగన్ దీక్ష చేసేందుకే నిర్ణయించుకున్నారు. దీక్షా స్థలి మార్పు విషయంలో వెనుకడుగు వేసేది లేదని ఆయన తేల్చిచెప్పారు.