: రద్దీలేని ప్రాంతాల్లో జగన్ దీక్ష చేపడితే అనుమతి లభించేది: మంత్రి ప్రత్తిపాటి
ప్రత్యేక హోదా దీక్ష చేయతలపెట్టిన వైఎస్ జగన్ కు మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు ఉచిత సలహా ఇచ్చారు. రద్దీలేని ప్రాంతాల్లో జగన్ దీక్ష చేపడితే అనుమతి లభించేదని చెప్పారు. ప్రజాహితం దృష్ట్యానే పోలీసులు నిర్ణయం తీసుకున్నారని తిరుపతిలో అన్నారు. కానీ ప్రభుత్వం కావాలనే చేసిందని ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పారు. ఇతరులకు ఇబ్బంది లేకుండా జగన్ ఎన్ని రోజులు దీక్షలు చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదన్నారు. ఆయన దీక్షతో మంచి జరిగితే స్వాగతిస్తామని, రాజకీయ డ్రామాలు మానుకుంటే మంచిదని ప్రత్తిపాటి సూచించారు. యూనివర్శిటీలు తిరిగి యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసలు ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకునేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.