: విపక్ష నేతల సీట్ల వద్దకెళ్లి ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా నిన్న సభలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మునుపటి వైఖరికి భిన్నంగా నిన్న సభలో విపక్షాల సభ్యులను పేరు పేరునా పలకరించారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఆయన తన సీటులో ఆసీనులు కావడానికి ముందు విపక్ష నేతల వద్దకు వెళ్లారు. తొలుత కాంగ్రెస్ సభ్యులు కూర్చున్న వైపునకు వెళ్లిన కేసీఆర్ జానారెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల సభ్యులను పలకరించిన తర్వాత కేసీఆర్ తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు.

More Telugu News