: గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో పోలీసుల సోదాలు... బళ్లారి జిల్లాను జల్లెడ పడుతున్న సిట్
ఓఎంసీ కేసులో ప్రధాన నిందితుడు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో నేటి ఉదయం ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు సోదాలు మొదలుపెట్టారు. ఓ కేసు దర్యాప్తు నిమిత్తం పెద్ద సంఖ్యలో సిట్ పోలీసులు నేటి తెల్లవారుజామునే బళ్లారి చేరుకున్నారు. ఐదు బృందాలుగా విడిపోయిన సిట్ పోలీసులు బళ్లారి నగరంతో పాటు జిల్లా మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఓ బృందం గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు మొదలుపెట్టింది. నగరంలో మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపిన మిగిలిన బృందాలు ఆ తర్వాత జిల్లాలోని మరో మూడు ప్రాంతాల్లో సోదాలకు వెళ్లాయి. గాలి జనార్దన్ రెడ్డి ఇంటిలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే, అసలు ఈ సోెదాలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయం తెలియక గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు.