: రణస్థలంలో రణరంగం... వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ

నిన్న కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ముని మడుగు... తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామం. అధికార, విపక్షాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. నేటి ఉదయం బంటుపల్లిలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల కార్యకర్తలు రాళ్లు చేతబట్టుకుని పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News