: సోమ్ నాథ్ ఎందుకు పారిపోతున్నారో?... ట్విట్టర్ లో కేజ్రీ ఆశ్చర్యం!

గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతి వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు సోమ్ నాథ్ భారతి ఎందుకు పారిపోతున్నారో తనకు అర్థం కావడం లేదని కేజ్రీవాల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సోమ్ నాథ్ భారతి వ్యవహారం ఆయన కుటుంబానికే కాక, తమ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని కూడా కేజ్రీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా పోలీసులకు సోమ్ నాథ్ సహకరించాలని ఆయన అన్నారు. ఇందుకోసం సోమ్ నాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాల్సిందేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

More Telugu News