: దారి తప్పి... భారత్ లో ప్రవేశించిన పాక్ బాలురు

పాకిస్థాన్ కు చెందిన ముగ్గురు బాలురు దారితప్పి, సరిహద్దు దాటి భారత్ లో ప్రవేశించారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లోని కిషన్ గఢ్ నుంచి వీరు కురియా బేరి గ్రామానికి చేరుకున్నారు. వీరిని గమనించిన గ్రామస్థులు సరిహద్దు భద్రతా దళాలకు సమాచారం అందించారు. దీంతో భద్రతా బలగాలు వారిని పట్టుకుని విచారించారు. వీరి వయసు 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని, వారి వద్ద ఎలాంటి అనుమానాస్పద పత్రాలు కానీ, వస్తువులు కానీ లభించలేదని భద్రతాధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లో ఆడుకుంటూ పొరపాటున వీరు భారత్ సరిహద్దుల్లో ప్రవేశించి ఉంటారని అభిప్రాయపడ్డారు.

More Telugu News