: తొలి స్పేస్ షాట్ గన్ ను అభివృద్ధి చేస్తున్న నాసా

ప్రపంచంలోనే తొలిసారిగా తొలి స్పేస్ షాట్ గన్ తయారవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా' ఈ గన్ ను అభివృద్ధి చేస్తోంది. భూమికి సమీపంలోని ఆస్టరాయిడ్ ను ఈ షాట్ గన్ తో పేల్చడం ద్వారా ఏర్పడే చిన్న శకలాలను సేకరించి, పరిశోధించాలనే లక్ష్యంతో షాట్ గన్ ను తయారు చేయిస్తోంది. ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్ (ఏఆర్ఎమ్)లో భాగంగా నాసా షాట్ గన్ తయారీపై దృష్టి సారించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆస్టరాయిడ్ లోని భారీ భాగాన్ని వేరు చేసి దాన్ని ముందుగా చంద్రుడి కక్ష్యలోకి పంపి, అటుపై అక్కడి నుంచి తదుపరి పరిశోధనల కోసం దానిని మానవ సహిత వ్యోమనౌక ద్వారా భూమికి చేర్చడం ఆస్టరాయిడ్ రీడైరెక్ట్ మిషన్ ప్రధాన లక్ష్యం.

More Telugu News