: బ్రహ్మోత్సవాల వేళ స్వామివారిపై తేజోకిరణం... మీరూ చూడండి!

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ జరుగుతున్న వేళ ఓ తేజోకిరణం స్వామివారిపై పడింది. ఆ సమయంలో దాన్ని అక్కడున్న ప్రధానార్చకులు డాక్టర్ రమణ దీక్షితులు సహా, ఎవరూ గమనించలేదు. అక్కడే ఉన్న టీటీడీ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ గరుడవాహనంపై స్వామివారు అధిష్టించిన తరువాత, ముందు నిలుచుని రమణ దీక్షితులు సెల్ ఫోన్ నుంచి ఫోటోలు తీయించుకున్నారు. ఆపై వాటిని చూసిన వారు ఆశ్చర్యపోయేలా శ్వేత వర్ణంలో తేజోకిరణం కనిపించింది. ఇది తిరునామంలా కనిపించడంతో, అది స్వామివారి మహిమేనని భక్తులు ఆనంద పరవశులయ్యారు. సూర్యకాంతి పడిందా? అని అనుకుంటే, ఆ సమయంలో స్వామివారి అలంకారం అంతా మండపంలో జరుగుతోంది కాబట్టి ఆ అవకాశం లేదు. సెల్ ఫోన్ ఫ్లాష్ అనుకుందామా? అంటే, ఫ్లాష్ పడితే, అది గుండ్రంగా కనిపిస్తుంది. అయితే, వాహన సేవ ఊరేగింపు ముందు తిరుమలలో మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో ఏదైనా మెరుపు కాంతి స్వామివారిపై పడివుండవచ్చని కొందరు చెబుతున్నా, అత్యధికులు స్వామివారి మహిమేనని భావిస్తున్నారు. ఈ విషయంపై రమణ దీక్షితులు స్పందిస్తూ, బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ, స్వామివారి మహిమతో ఏర్పడ్డ తేజో కాంతి కిరణమని స్పష్టం చేశారు. ఆ దృశ్యం మీరూ చూడండి!

More Telugu News