: తెలంగాణలో మద్యం టెండర్లకు పోటెత్తిన వ్యాపారులు

తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్లకు ప్రభుత్వం ఆహ్వానం పలికింది. దీంతో వ్యాపారులు టెండర్ల ప్రక్రియలో పాల్గొనడానికి పోటెత్తారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న 2,216 మద్యం షాపులకు టెండర్లు పిలవగా, మొత్తం 14 వేల దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఇంకా వ్యాపారులు క్యూలైన్లలో నిలుచున్నారని వారు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మద్యం వ్యాపారులలో తీవ్రమైన పోటీ ఉందని, భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అధికారులు అంటున్నారు. వ్యాపారుల దగ్గర్నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. వివిధ జిల్లాల నుంచి టెండరు దరఖాస్తులు పెరిగాయని వారు పేర్కొన్నారు. కాగా, కేవలం టెండరు దరఖాస్తులతోనే తెలంగాణ ప్రభుత్వానికి పది కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

More Telugu News