: ఎవరు ఏమి తినాలో మేము నిర్ణయించం: మమతా బెనర్జీ

ముంబైలో మాంసం విక్రయాలపై నిషేధం విధించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి విషయాల్లో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆమె స్పష్టం చేశారు. ఎవరు ఏమి తినాలి, ఏమి తినకూడదు? అనే విషయాన్ని తాము నిర్ణయించలేమని చెప్పారు. ఏమి తినాలనేది ఎవరికి వారు తీసుకునే సొంత నిర్ణయమని అన్నారు. ఈ రోజు కోల్ కతాలో మైనారిటీ డెవలప్ మెంట్ శాఖ ఓ కార్యక్రమం నిర్వహించింది. దీనికి హాజరైన మమతా బెనర్జీ... ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News