: తన జీవితంలో తొలిసారి యాడ్ లో కనిపించనున్న కమలహాసన్
భారతదేశం గర్వించదగ్గ నటుడు కమలహాసన్. ఎంతో స్టార్ డమ్ కలిగిన కమల్ ఇంతవరకు ఒక్క కమర్షియల్ యాడ్ లో కూడా నటించలేదు. తన జీవితంలోనే తొలిసారి ఓ ప్రకటనలో కనిపించనున్నారు. పోతిస్ అనే టెక్స్ టైల్ షోరూమ్ యాడ్ లో ఆయన కనపడనున్నారు. ఈ వారంలో యాడ్ ను షూట్ చేయనున్నారని సమాచారం. యాడ్ నిడివి రెండు నిమిషాలు ఉంటుందట. ఓ ప్రత్యేక సెట్ లో ఈ యాడ్ ను చిత్రీకరించనున్నారు. కమల్ కుమార్తె శృతి హాసన్ ఇప్పటికే పోతిస్ యాడ్ లో నటించింది.