: గన్నవరం నుంచీ ‘చెర్రీ’ ట్రూజెట్ సేవలు ప్రారంభం
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ భాగస్వామిగానే కాక బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తున్న ‘ట్రూజెట్’ విమాన సేవలు నెమ్మదిగానే అయినా, పక్కా ప్రణాళికతో విస్తరిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ ఎయిర్ వేస్ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజాగా ట్రూజెట్ విమాన సేవలు నిన్న విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ప్రారంభమయ్యాయి. శంషాబాదు నుంచి గన్నవరం చేరుకున్న ట్రూజెట్ విమానం, తిరిగి హైదరాబాదుకు విజయవంతంగా తిరుగు ప్రయాణమైందని ఆ సంస్థ ఎండీ వంకాయలపాటి ఉమేశ్ ప్రకటించారు. రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాలకు త్వరలోనే తమ సేవలు విస్తరిస్తామని ఆయన తెలిపారు.