: బైట్స్ ద్వారా 'అఖిల్'కు ఆల్ ది బెస్ట్ చెప్పిన సినీ ప్రముఖులు వీరే!

'అఖిల్' ఆడియో వేడుక సందర్భంగా హీరో అఖిల్ కి చాలా మంది పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో...అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, నాగేశ్వరరావు, నాగార్జున బాధ్యతలు తీసుకోవడమంటే చాలా కష్టంతో కూడుకున్నదని, దానిని పరిరక్షించడానికి ప్రతి క్షణం కష్టపడాలని సూచించారు. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ, అఖిల్ కెరీర్ దిగ్విజయంగా కొనసాగాలని, సినిమాల్లో రాణించాలని కోరారు. కమల్ హాసన్ మాట్లాడుతూ, అఖిల్ కూడా సినిమా కుటుంబంలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. కానీ చాలా పెద్ద బాధ్యతతో సినిమాల్లోకి వస్తున్నావన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. 'సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్నావు, వారి సంప్రదాయాలు పరిరక్షించాలి' అని ఆయన సూచించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మాట్లాడుతూ, నాగేశ్వరరావు గారు వేసిన బాటను నాగార్జున గారు జాగ్రత్తగా మలచుకుంటూ వచ్చారు. దానిని కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుని, కష్టపడాలి' అని చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ, అద్భుతమైన భవిష్యత్ ఉందని, జాగ్రత్తగా నడుచుకోవాలని హితవు పలికారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, 'ఆల్ ది బెస్ట్ బ్రదర్, తెలుగు సినీ రంగంలోకి సుస్వాగతం' అని చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ, అఖిల్ స్టిల్స్ చూశానని, భలే అందంగా ఉన్నాడని అన్నాడు. అలాగే స్టంట్స్ చూశానని, అవి మరింత అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, అసలు కంటే వడ్డీ ముద్దు అని అందరూ అంటారని, నాగార్జున అసలు అయితే, అఖిల్ వడ్డీ అని త్రివిక్రమ్ చెప్పాడు. టీజర్ చూడగానే భలే ఉందనిపించిందని ఆయన చెప్పారు. సూపర్ స్టార్ ను చూసేందుకు వెయిటింగ్ అని అన్నారు. రానా 'ఆల్ ది బెస్ట్' అంటూ గ్రీటింగ్స్ చెప్పాడు. అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'అఖిల్! నువ్వు నాకు చాలా ఇష్టం, నీ మంచి తనం చాలా నచ్చుద్ది' అని చెప్పాడు. తాతగారు, నాన్నలా గ్రేట్ హైట్స్ లో నిన్ను చూస్తానని తెలిపాడు. అలాగే, మంచు లక్ష్మి, కాజల్, శ్రుతి హాసన్ తదితరులు అఖిల్ ను అభినందిస్తూ బైట్స్ ఇచ్చారు.వీటిని వేడుకలో ప్రదర్శించారు.

More Telugu News