: రాజుల కాలాల్లోనే తెలుగు వెలిగింది... ఇప్పుడు కనుమరుగవుతుందా?: కమలహాసన్

తమిళనాడులో తెలుగు కనుమరుగవడంపై ప్రముఖ నటుడు కమలహాసన్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తనకు రాజకీయాలు తెలియవని చెప్పిన ఆయన, ఏ గవర్నమెంటు కూడా తెలుగు ప్రజలను వదులుకోదని అన్నారు. ఓట్లు కావాలనుకునే ఏ పార్టీ భాషను బలవంతంగా రుద్దదని తాను భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తమిళనాడులో తెలుగు మాయమవుతుందని తాను భావించడం లేదని ఆయన చెప్పారు. రాజుల కాలాల్లోనే తెలుగు ఓ వెలుగు వెలిగి విలసిల్లిందని ఆయన చెప్పారు. అప్పట్లో తంజావూరు కేంద్రంగా త్యాగయ్య ఎన్నో అద్భుతమైన రచనలు చేశారని ఆయన గుర్తు చేశారు. తెలుగు భాషపై ఆందోళనకు పవన్ కల్యాణ్ కోరితే సానుకూలంగా స్పందించడంలో అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.

More Telugu News