: సిరియాలో 45 మంది సైనికులను కాల్చి చంపిన ఆల్ ఖైదా

సిరియాలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. గత వారం బందీలుగా పట్టుకున్న 45 మంది సిరియా సైనికులను దేశంలోని వాయవ్య ప్రాంతంలో కాల్చి చంపేశారు. ఈ వివరాలను పలువురు సామాజిక కార్యకర్తలు ధ్రువీకరించారు. అయితే, 56 మంది సైనికులను చంపి ఉంటారని బ్రిటన్ కు చెందిన మానవ హక్కుల అబ్వర్వేటరీ సంస్థ వెల్లడించింది. ఆల్ ఖైదా తాను స్వాధీనం చేసుకున్న అబు జుహార్ ఎయిర్ బేస్ రన్ వే పై ఈ మారణహోమానికి పాల్పడిందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులతో సిరియాలో భయానక వాతావరణం నెలకొంది.

More Telugu News