: సౌత్ ఆఫ్రికా సిరీస్ కు టీమిండియా జట్టు ఎంపిక రేపే
అక్టోబర్ 2వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ లో జరగనున్న సిరీస్ కు టీమిండియా జట్టును బీసీసీఐ రేపు ఎంపిక చేయనుంది. ఈ ఎంపికలో ప్రధానంగా ధోనీపైనే సెలెక్టర్లు ఫోకస్ చేసే అవకాశం ఉంది. టీ20, వన్డేలకు ధోనీని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టుతో పాటు ధోనీని సన్నద్ధం చేసేందుకు సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తం 72 రోజుల పాటు సఫారీలు భారత్ లో పర్యటించనున్నారు. ఈ సిరీస్ లో మూడు టీ20లు, ఐదు వన్డేలు, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనున్నారు. టీ20 మ్యాచ్ తో సిరీస్ ప్రారంభం కానుంది.