: తూ.గోదావరి జిల్లా గండేపల్లి బాధిత కుటుంబాలకు వైసీపీ ఆర్థిక సాయం

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికసాయం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున, గాయపడిన వారికి రూ.5వేల చొప్పున వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ చెక్కులు అందించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. గతవారం గండేపల్లి జాతీయ రహదారిపై లారీ బోల్తా కొట్టడంతో 16 మంది వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రభుత్వం ఇప్పటికే చనిపోయిన వారికి, క్షతగాత్రులకు ఆర్థికసాయం ప్రకటించింది.

More Telugu News