: ప్రత్యేక హోదా రాకున్న ఫర్వాలేదు, డబ్బులిస్తే చాలు: జేసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదాను ఇవ్వకపోయినా ఫర్వాలేదని, అధికంగా నిధులిస్తే చాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెదేపా నేత, పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అమరావతి నగర నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని, అదో సుదీర్ఘ ప్రక్రియ అని అభివర్ణించిన జేసీ, 13 జిల్లాల్లో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి నీళ్లను కలపడానికి ఆయన చేసిన ప్రయత్నాలను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు వివరించారు.

More Telugu News