: నదుల అనుసంధానమంటే..చెంబుతో నీళ్లు తీసుకెళ్లి పోయడం కాదు: ఉండవల్లి

'నదుల అనుసంధానమంటే చెంబుతో నీళ్లు తీసుకెళ్లి పోయడం కాదు. పట్టిసీమ ఓ బోగస్ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం కోసమే పట్టిసీమను తెచ్చారు' అంటూ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టిసీమలో రూ.490 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. మైలవరం మండలం వెలగనేరు దగ్గర భలేరావు చెరువుకు గండికొట్టి దానినే అనుసంధానమంటూ ప్రజలను నమ్మించారంటూ ఉండవల్లి మండిపడ్డారు. పోలవరం కాలువ తవ్వకంలో ఎంత అవినీతి జరిగిందో సీఎం చంద్రబాబు బయటపెట్టాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.

More Telugu News