: ఆర్థిక కష్టాల్లో ఏపీ ప్రభుత్వం... 8వ తేదీ తరువాత బిల్లులు పెండింగ్ లో పెట్టాలని ట్రెజరీలకు ఆదేశం

రాష్ట్ర విభజన నుంచి ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సమస్యల్లో పడింది. రాష్ట్రం నుంచి వస్తున్న ఆదాయంతో తప్పనిసరిగా చెల్లించాల్సిన జీతాలు, బిల్లులు, తదితరాలకు సరిపోక కష్టాలు వెంటాడుతున్నాయి. ఆదాయాన్ని రాబట్టుకోవాలన్న ఆలోచనతో ఇప్పటికే రాష్ట్రంలో భూరిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినా ఏమాత్రం ఉపయోగంలేనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీవరకు వచ్చిన బిల్లులను మాత్రమే ఆమోదించాలని ట్రెజరీలకు ఆర్థిక శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నెల 8వ తేదీ తరువాత వచ్చిన బిల్లులను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పెండింగ్ లో ఉంచాలని ఆర్థిక శాఖ కోరింది.

More Telugu News