: చినిగి, చీకిపోయి... 40 ఏళ్ల తరువాత అడ్రెస్ చేరిన పార్శిల్


ఆస్ట్రేలియాలోని ఓ మెయిల్ సర్వీస్ కంపెనీ మెల్ బోర్న్ టెన్నిస్ క్లబ్ సభ్యులకు ఓ చిత్రమైన అనుభవం మిగిల్చింది. టెన్నిస్ క్లబ్ కు చెందిన మాజీ సభ్యురాలికి నాలుగు దశాబ్దాలు ఆలస్యంగా చేరిన పార్శిల్ అందర్లోనూ ఆసక్తి రేపింది. 1975 ప్రాంతంలో వచ్చిన ఓ పార్సిల్ ని అప్పటి టెన్నిస్ క్లబ్ మాజీ సభ్యురాలు ఇరేన్ గారట్ కి ఇప్పుడు అందజేశారు. అప్పట్లో ఈ మెయిల్ అప్పటి పోస్టల్ యంత్రాల మధ్య పడిపోయి ఉంటుందని, అందువల్లే సరైన సమయంలో ఆమెకు చేరవేయలేదని, కంపెనీ తరలింపు నేపథ్యంలో ఇప్పుడు కంటబడిన ఆ పార్శిల్ ను తాజాగా ఆమెకు అందజేశారని క్లబ్ సభ్యులు తెలిపారు. పార్శిల్ అందుకున్న ఇరేన్ గారట్ మాట్లాడుతూ, దీనిని తాను నమ్మలేకపోతున్నానని, ఇప్పుడిది నవ్వు తెప్పిస్తోందని అన్నారు. అప్పట్లో జరిగిన విషయాలేవీ తనకు గుర్తు లేవని ఆమె తెలిపారు. తన అడ్రెస్ ఉంది కనుక అప్పట్లో ఎవరో బుక్ చేసి ఉంటారని ఆమె అన్నారు. ఈ పార్శిల్ తన పాత మిత్రులను గుర్తు చేసుకునేందుకు, కలిసేందుకు ఉపయోగ పడిందని ఆమె పేర్కొన్నారు. అయితే పార్శిల్ ఇన్నేళ్ల తరువాత కూడా ఆమెకు చేరడం చూస్తే కొంత మంది అయినా నిజాయతీగా పనిచేస్తున్నారని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News