: పాత్రికేయులకు శుభవార్త... ‘సిగ్నల్’ పేరిట కొత్త టూల్ కు ఫేస్ బుక్ సన్నాహాలు


మీడియా రంగంలో పనిచేస్తున్న తన యూజర్ల కోసం ఫేస్ బుక్ ఓ కొత్త టూల్ ను ప్రవేశపెడుతోంది. మొత్తం వార్తలు, ఫొటోలు, వీడియోలను ఒక్కచోటుకి చేర్చి వాటిని మీడియా ప్రతినిధులకు అందించేందుకు ‘సిగ్నల్స్’ పేరిట ఓ కొత్త టూల్ ను ప్రవేశపెడుతున్నట్లు ఫేస్ బుక్ మీడియా డైరెక్టర్ ఆండీ మిచెల్ తెలిపారు. తాము కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ టూల్ ద్వారా మీడియా ప్రతినిధులు అతి సులువుగా వార్తలను తయారుచేసుకోగలుగుతారని ఆయన ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈ టూల్ లో ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంలలో పోస్టయ్యే వార్తలన్నీ ఒకే చోట లభిస్తాయని ఆయన వివరించారు. పాత్రికేయులకు ఉచితంగానే లభించనున్న ఈ టూల్ ను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నామనే విషయాన్ని మాత్రం మిచెల్ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News