: కమిట్ మెంట్ అంటే అలా వుండాలి: దేవినేనిపై చంద్రబాబు పొగడ్తల వర్షం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొగడ్తల వర్షం కురిపించారు. పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేయాల్సిందేనని ఆయన, ఇరిగేషన్ అధికారులు మూడు రోజుల నుంచి నిద్రాహారాలు మాని కష్టపడుతున్నారని, వారి కమిట్ మెంట్ చూసి తనకు ఎంతో ఆనందం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఏదైనా పని తలపెడితే, అదే విధమైన కృషి, పట్టుదల ఉండాలని, అటువంటి అంకితభావమే మిగిలిన మంత్రుల్లో, అధికారుల్లో రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దేవినేని కృషి కారణంగానే నదుల అనుసంధానం వేగంగా పూర్తయిందని, నేటి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు తెలిపారు. దేవినేని ఉమ సారథ్యంలో సాధ్యమైనంత త్వరలోనే పట్టిసీమ నుంచి నీటి విడుదల జరుగుతుందని తాను నమ్ముతున్నట్టు వివరించారు.

More Telugu News