: బీజేపీకి షాకివ్వనున్న యువ సంచలనం...బీహార్ లో నాలుగు భారీ ర్యాలీలకు సన్నాహాలు
పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్ల పేరిట చేపట్టిన ఉద్యమంతో ఒక్కసారిగా దేశవ్యాప్త యువ సంచలనంగా మారిన హార్దిక్ పటేల్ ఇతర రాష్ట్రాలకూ పోరును విస్తరించనున్నారు. ఇప్పటికే పటేల్ నవనిర్మాణ సేన (పీఎన్ఎస్) పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిన హార్దిక్, పటేల్ సామాజిక వర్గం ఉన్న 14 రాష్ట్రాల్లో పీఎన్ఎస్ శాఖలను ఏర్పాటు చేయగలిగారు. తాజాగా వచ్చే వారంలో బీహార్ లో నాలుగు భారీ ర్యాలీలకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. హార్దిక్ పటేల్ ర్యాలీల కారణంగా బీజేపీ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడే అవకాశాలున్నాయి. పటేల్ సామాజిక వర్గంపై దాడులకు పాల్పడ్డ బీజేపీనే కాక ఏ ఒక్క పార్టీని, నేతనూ వదిలేది లేదని ఆయన చెబుతున్నారు. ఇక బీహార్ లో జరగనున్న ర్యాలీల్లో గుజరాత్ లో పనిచేస్తున్న పటిదార్ అమానత్ ఆందోళన సమితికి చెందిన 197 మంది కన్వీనర్లు కూడా పాలుపంచుకోనున్నారు.