: బీజేపీ 'బీహార్' తొలి జాబితా విడుదల... విశేషాలు
బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న వారి తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. పొత్తుల్లో భాగంగా 160 స్థానాల్లో బరిలోకి దిగనున్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితా విశేషాలు ఇవే...
* మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతం సీట్లు.
* 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు. ముగ్గురు సిట్టింగ్ లకు మొండి చేయి.
* 14 మంది కొత్త వారికి అవకాశం.
* జాబితాలో 50 శాతం మంది యువకులు, మహిళలే.
* ఆర్జేడీ, జేడీయూలను దెబ్బతీసేందుకు బీసీలకు ఎక్కువ సీట్లు.
* లాలూను ఇబ్బంది పెట్టేందుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి టికెట్లు.
* తొలి జాబితాలో ముస్లింలకు మొండి చేయి. రెండో జాబితాలో అవకాశం ఉంటుందంటున్న నేతలు.
* బ్రాహ్మణ, రాజ్ పుట్, భూమిహార్ లకు కూడా ప్రాధాన్యం.