: నేను నరేంద్ర మోదీ కూతురిని... అంటూ చమత్కరించిన హీరోయిన్!
‘నేను నరేంద్ర మోదీ కూతురిని’ అని అంటున్న ఆ అమ్మాయి ఎవరంటే...బాలీవుడ్ సినిమా 'క్యాలెండర్ గర్ల్స్' హీరోయిన్, గుజరాత్ మోడల్ అవానీ మోదీ. మాధుర్ భండార్కర్ సినిమాలో నటించిన అవానీ మోదీ అసలు ఎందుకిట్లా అందంటే... "ప్రధాని నరేంద్రమోదీ మీకేమైనా బంధువవుతారా? అంటూ చాలామంది నన్ను తరచుగా ప్రశ్నిస్తుంటారు. దానికి కారణం, మోదీ అన్న ఇంటిపేరు ఇద్దరి పేర్లలో ఉండటమే. దానికితోడు నేను మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు చెందిన దానిని కావడంతో ప్రధానితో నాకేదో బంధుత్వముందని అనుకునేవారు. దానికి నేను ఏం సమాధానం చెప్పేదానినంటే..అవును. నేను మోదీ కూతురినే అని. కేవలం గుజరాత్ అమ్మాయిలే కాదు, దేశంలోని కూతుళ్లందరూ కూడా ఆయన కూతుళ్ళే అని చెప్పేదానిని. ఎందుకంటే, ప్రధాని నరేంద్ర మోదీ తండ్రి లాంటి వ్యక్తి కనుక ఈ సమాధానం చెప్పేదానిని" అంటూ అవానీ మోదీ నవ్వులు చిందిస్తూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.