: మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్న హృతిక్ మాజీ భార్య!
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ మళ్లీ వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. తన మాజీ భర్త హృతిక్ స్నేహితులలో ఒకరిని ఆమె పెళ్లి చేసుకుంటుందట. హృతిక్, సుసానే జంట పదమూడేళ్లపాటు కలిసి జీవించారు. ఒకప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ ఫ్యాషనబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వాళ్లిద్దరూ అనంతర పరిణామాల నేపథ్యంలో నవంబరు, 2014న విడాకులు తీసుకున్నారు. ఇంకా ఏడాది కూడా గడవక ముందే సుసానే ఖాన్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతోంది.