: వైఎస్ హయాంలో ఆస్తులు కొల్లగొట్టారు: సోమిరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో ప్రథమ స్థానంలో నిలిచిందని, తన పదవిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఆస్తులను ఆయన కొల్లగొట్టారని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లడారు. వైఎస్ దోచుకున్న డబ్బును ప్రజలకు అప్పగిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి పైసా కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు. కాగా, పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.