: ‘సుప్రీం’కు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్
గృహహింస, హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమ్ నాథ్ భారతి న్యాయవాది దయాన్ కృష్ణన్ మంగళవారం మాట్లాడుతూ సోమ్ నాథ్ భారతి పిటిషన్ ను పరిశీలించేందుకు బీడీ అహ్మద్, సంజీవ్ సచ్ దేవ్ లతో కూడిన బెంచ్ అంగీకరించిందని చెప్పారు. సోమ్ నాథ్ కు ముందస్తు బెయిల్ తిరస్కరించిన విషయాన్ని వారికి విన్నవించామన్నారు. సోమ్ నాథ్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నందున, ఆయనకు ముందస్తు బెయిల్ అత్యవసరమని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశామన్నారు.