: జగన్ యువభేరి సదస్సు ప్రారంభం... హాజరైన వేలమంది విద్యార్థులు

తిరుపతిలోని పీఎల్ఆర్ కన్వెన్షన్ లో యువభేరి సదస్సును ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనం కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వైసీపీ నేతలు, ఎస్వీ యూనివర్శిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కూడా వేలాదిమంది విద్యార్థులు హాజరయ్యారు. వైఎస్ జగన్ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. ప్రత్యేక హోదాతో కలిగే లాభాలను విద్యార్థులకు, యువతకు ఈ సదస్సులో జగన్ తెలియజేయనున్నారు. కాగా ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఈ సదస్సు నిర్వహించాలనుకున్నప్పటికీ అనుమతి రాలేదు.

More Telugu News