: కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చారు?: సీపీఐ నేత చాడ

విమోచన దినంగా సెప్టెంబర్ 17వ తేదీని నిర్వహించాలని గతంలో డిమాండ్ చేస్తూ, ఉద్యమించిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. విమోచన దినంపై కేసీఆర్ కనీసం మాట్లాడటం కూడా లేదని మండిపడ్డారు. విమోచన దినానికి, మతాలకు సంబంధం లేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే, తామే సెప్టెంబర్ 17వ తేదీన తమ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేస్తామని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సభ జరిగింది. ఈ సభకు హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

More Telugu News