: జగన్ సమావేశ వేదిక మారింది
తిరుపతిలోని ఎస్వీ యూనిర్శిటీలో వైకాపా అధినేత జగన్ తలపెట్టిన విద్యార్థులతో సమావేశానికి సంబంధించిన వేదిక మారింది. యూనివర్శిటీలో సమావేశానికి అధికారులు అనుమతించకపోవడంతో వేదికను మార్చారు. ఎయిర్ పోర్ట్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులతో జగన్ భేటీ అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై విద్యార్థులతో జగన్ చర్చిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొంటారు.