: జగన్ సభకు అనుమతి ఇచ్చి, ఇప్పుడు రద్దు చేశారు... ఇది చంద్రబాబు కుట్రే: వైకాపా
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ఆడిటోరియంలో తమ అధినేత జగన్ నిర్వహించతలపెట్టిన ప్రత్యేక హోదా సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడంపై వైకాపా ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామిలు మండిపడ్డారు. సదస్సుకు తొలుత అనుమతి ఇచ్చారని... ఇప్పుడు రద్దు చేశారని చెప్పారు. తమ సభకు అనుమతి ఇవ్వకపోవడం ముమ్మాటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రే అని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏమి కావాలని ప్రశ్నించారు. చంద్రబాబు ఎలాంటి కుట్రలు పన్నినా జగన్ తో తాము ముఖాముఖి నిర్వహిస్తామని... ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు.