: దయానిధి మారన్ ముందస్తు బెయిల్ పొడిగింపు
కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ కు సుప్రీంకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. ఆయన అరెస్టుపై స్టేను సర్వోన్నత న్యాయస్థానం మరింత పొడిగించింది. ఈ కేసులో అక్టోబర్ 1వ తేదీ కల్లా సమాధానం తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో మారన్ సీబీఐ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన గతంలో మద్రాస్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ గడువు ముగియడంతో మళ్లీ అభ్యర్థించినప్పటికీ న్యాయస్థానం తిరస్కరించి వెంటనే సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దాంతో హుటాహుటిన ఆయన ఆగస్టులో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ వెంటనే మారన్ ను అరెస్టు చేయరాదంటూ సుప్రీం ముందస్తు బెయిల్ ఇచ్చింది. నేటితో ఆ గడువు ముగియడంతో మరల దానిని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.