: షాకింగ్ న్యూస్... 559 మంది ఐఏఎస్ అధికారులకు ఆస్తే లేదట!

ఒకసారి సివిల్ సర్వీసెస్ అధికారి అయితే... అందులోనూ ఐఏఎస్ అధికారి అయితే లైఫ్ ఎలా ఉంటుందో సామాన్యుడికి కూడా తెలుసు. ఖరీదైన బంగళాలు, లగ్జరీ కార్లు... ఇలా ప్రతిఒక్కటీ వారి సొంతమే అన్న సంగతి ఓపెన్ సీక్రెట్. ఒకవేళ సదరు ఐఏఎస్ అధికారి ఎంతో నిజాయతీపరుడైనప్పటికీ... జీత, భత్యాలు బాగానే ఉంటాయి కనుక, ఎంతో కొంత ఆస్తి అయితే గ్యారంటీగా ఉంటుంది. కానీ, 2014 సంవత్సరంలో ఐఏఎస్ అధికారులు ఇచ్చిన ఆస్తి వివరాలు చూస్తే షాక్ కొట్టక మానదు. దేశం మొత్తమ్మీద 4526 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే, వారిలో 559 మందికి అసలు ఆస్తులే లేవట. ఈ వివరాలను సదరు అధికారులే వెల్లడించారు. మరో 661 మంది ఐఏఎస్ లు తమ ఆస్తుల వివరాలు ఇవ్వలేదు. ఆస్తులు లేని ఐఏఎస్ లలో 57 మంది ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందినవారు కాగా, 33 మంది మహారాష్ట్ర, 31 మంది తమిళనాడు కేడర్ కు చెందిన వారు ఉన్నారు. అయితే, నేరుగా ఐఏఎస్ ల పేరు మీద కాకుండా వారి భార్యలు లేదా కుటుంబసభ్యుల పేరు మీద ఆస్తులు ఉండవచ్చేమో అని మాజీ సమాచార కమిషనర్ హబీబుల్లా అభిప్రాయపడటం కొసమెరుపు.

More Telugu News