: విజయం కంటే ఓటమే ఎక్కువ పాఠాలు నేర్పుతుంది: శిఖర్ ధావన్
విజయం కంటే ఓటమే ఎక్కువ పాఠాలు నేర్పుతుందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీలో ధావన్ మాట్లాడుతూ, గతంలో టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసినప్పటికీ నిలకడలేమితో జట్టుకు దూరమయ్యానని చెప్పాడు. గత ఆరేడు నెలలుగా నిలకడగా ఆడుతున్నానని ధావన్ చెప్పాడు. 2015 వరల్డ్ కప్ నుంచి తన ఆటతో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని ధావన్ తెలిపాడు. జట్టుకు ఉపయుక్తమైన పరుగులు సాధిస్తున్నానని అన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో రెండు సెంచరీలు సాధించి జోరుమీదుండగా గాయం బారినపడడం ఆందోళన కలిగించిందని ధావన్ చెప్పాడు. విజయం నుంచి కంటే ఓటమి నుంచే విలువైన పాఠాలు నేర్చుకోవచ్చని ధావన్ వివరించాడు. తదుపరి సిరీస్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపాడు.