: సచిన్ లేకుండా జట్టా... నో ... వెంటనే ఆయన పేరు చేర్చండి!: బీసీసీఐ చీఫ్
సచిన్ లేకుండా టీమిండియా జట్టా? అంటూ బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియా ఆశ్చర్యపోయారు. ఇటీవల ప్రకటించిన టీమిండియా లిస్టులో సచిన్ పేరు లేకపోవడంతో దాల్మియా అలా స్పందించారు. అంతేకాదు, తక్షణం సచిన్ పేరును చేర్చాలంటూ బీసీసీఐ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో బీసీసీఐ సిబ్బంది సచిన్ 2013లోనే రిటైర్మెంట్ ప్రకటించారని, ప్రస్తుతం ఆట నుంచి విశ్రాంతి తీసుకుని, ఇతర వ్యాపకాలతో బిజీగా ఉన్నారని తెలిపారు. 75 ఏళ్లు పైబడిన జగ్ మోహన్ దాల్మియా అమ్మేసియా (మతిమరపు)తో బాధపడుతున్నారు. దాని కారణంగానే సచిన్ రిటైర్మెంట్ విషయం మర్చిపోయారు. రిటైర్మెంట్ మర్చిపోయినప్పటికీ సచిన్ పేరును మర్చిపోకపోవడం విశేషం. కాగా, 2017 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్ మోహన్ దాల్మియా కొనసాగనున్నారు.