: ప్రియురాలి అభ్యంతరకర ఫొటోలతో బ్లాక్ మెయిల్!

ఆ యువకుడి వయస్సు 19. కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న గౌతమి అనే అమ్మాయితో అతనికి ప్రేమ వ్యవహారం ఉంది.ఇద్దరూ కలిసి చెట్టూపుట్టా అన్నీ తిరిగారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి చాలా ఫొటోలు దిగారు. వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవీ ఉన్నాయి. దీంతో ఆ అమ్మాయి నుంచి డబ్బు గుంజాలనుకున్నాడు. ఒక లక్ష రూపాయలు తనకు ఇవ్వాలని, లేకపోతే ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని గౌతమిని బెదిరించడం ప్రారంభించాడు. ఈ తాటాకు చప్పుళ్లకు తానేమి బెదరనని గౌతమి సమాధానం చెప్పింది. దీంతో కంగుతిన్న ఆ యువకుడు వారిద్దరూ దిగిన ఒక అభ్యంతరకర ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. దీంతో, గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ యిచ్చి వదిలిపెట్టారు. కానీ, అతని ప్రవర్తనలో ఏ మార్పు రాకపోవడంతో యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News