: వామ్మో... ఎంత పెద్ద పాదాలో!


సాధారణంగా పాదాల సైజు 10 ఇంచెస్ ఉంటే పెద్ద పాదాలు అంటాం. ఇంకా కొందరికి 11 సైజు పాదాలు ఉంటాయి. వారిని జంబోపాదాలున్న వ్యక్తిగా సంబోధిస్తాం. మరి ఈ సైజుకు డబుల్ ఉంటే సూపర్ జంబో పాదాలనాలేమో...అలాంటి సూపర్ జంబో పాదాలు కలిగిన వ్యక్తి వెనిజులాలో ఉన్నాడు. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అతి పెద్ద పాదాలు కలిగిన వ్యక్తిగా వెనిజులాకు చెందిన జేసన్ ఓర్లాండో రోడ్రిగ్జ్ హెర్నాండెజ్ (20) రికార్డు పుటలకెక్కాడు. అతని పాదాల సైజు 40.1 సెంటీ మీటర్లు. కుడి పాదం సైజు 40.1 సెంటీ మీటర్లు కాగా, ఎడమ పాదం సైజు కాస్త తక్కువగా 39.6 సెంటీమీటర్లు ఉందని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. సాధారణ వ్యక్తి పాదాలతో పోలిస్తే జేసన్ పాదాలు రెట్టింపు సైజు ఉన్నాయని వారు వెల్లడించారు. జేసన్ తన పాదాలు అందరికంటే పెద్దగా ఉండడాన్ని తొమ్మిదో ఏటనే గుర్తించాడట. అప్పటి నుంచి పెరుగుతూ పెరుగుతూ గిన్నిస్ రికార్డు సృష్టించేంతగా పెరిగాయని తెలిపాడు.

  • Loading...

More Telugu News