: అమెరికా పర్యటనలో మోదీకి తగలనున్న 'పటేల్' సెగ!

ఈ నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీకి పటేళ్ల కోటా సెగ తగలనుంది. యూఎస్ లో ఉన్న పటేల్ కులస్తులు ఇందుకు సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గుజరాత్ లో పటేల్ కులస్థులు నిర్వహించిన ర్యాలీపై పోలీసుల దాష్టీకాన్ని గుర్తుచేస్తూ ఆరు నగరాలలో ఉన్న ఇండియన్ కాన్సులేట్లకు యూఎస్ లోని పటేల్ కులస్తులు ఈ మెయిల్స్ పంపుతున్నారు. ఆ దేశంలో ఉన్న ఎన్ఆర్ఐ పటేల్ కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చారు. 'ఓవర్సీస్ పాటిదారు ఆందోళన్ సమితి' (ఓపీఏఎస్) పేరుతో పటేల్ యువత ముందుకెళ్లనున్నారు. తాజా పర్యటనకు రానున్న మోదీ యూఎస్ లో అడుగుపెట్టిన రోజు నుంచి నిరసనలు హోరెత్తిస్తామని ఓపీఏఎస్ అంటోంద ఓపీఏఎస్ కన్వీనర్ తేజస్ పటేల్ మాట్లాడుతూ యునైటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం నుంచి న్యూయార్క్ లోని భారత రాయబార కార్యాలయం వరకు అంటే సుమారు 3.5 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. యూఎస్ అధికారుల నుంచి తమకు అనుమతి కూడా లభించిందని చెప్పారు. అంతేకాకుండా, నల్లదుస్తులు, నల్ల జెండాలు ధరించి తమ నిరసన వ్యక్తం చేయనున్నట్లు తేజస్ పటేల్ చెప్పారు.

More Telugu News