: శ్రీనగర్ లో ఎగిరిన పాక్, ఐఎస్ఐఎస్ జెండాలు

జమ్ము కాశ్మీర్ లో మాంసం అమ్మకాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం నాడు ఆందోళనలు వెల్లువెత్తాయి. జమ్ము కాశ్మీర్ హైకోర్టు తీర్పుపై ఆందోళనకారులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో పోలీసులపై రాళ్లు రువ్వారు. ముస్లిం ప్రార్థనల అనంతరం, ముసుగులు ధరించిన కొంతమంది యువకులు రెచ్చిపోయారు. అల్ జిహాద్ ఉగ్రవాద సంస్థ, ఐఎస్ఐఎస్, పాకిస్థాన్ జెండాలతో ఉన్న బ్యానర్లను చేత బట్టిన యువకులు నానా యాగీ చేశారు. శ్రీనగర్ లోని నోవాఠా ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మక జామియా మసీదు వద్ద ఈ తతంగం అంతా జరిగింది. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ముజఫర్ ల పోస్టర్లను వారు ప్రదర్శించారు.

More Telugu News