: పెద్ద జబ్బుతో బాధ పడుతున్న ఆ కీలక నేత ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు?: రేవంత్ రెడ్డి
హైదరాబాదులో ఒక రైతు చేసుకున్న ఆత్మహత్యకు కారణం వ్యవసాయ రుణం కాదని... దీర్ఘకాలిక వ్యాధే కారణమని టీఎస్ ప్రభుత్వం చెప్పడంపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీర్ఘకాలిక వ్యాధే ఆత్మహత్యకు కారణమైతే... ప్రభుత్వంలో ఒక కీలక నేత పెద్ద జబ్బుతో బాధపడుతున్నారని, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావులు సీఎం పదవికి పోటీపడుతూ మానసికంగా చాలా బాధపడుతున్నారని.... వారెందుకు ఆత్మహత్య చేసుకోలేదని అన్నారు. వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రెండు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారని, ఆయనెందుకు సూసైడ్ చేసుకోలేదని ప్రశ్నించారు.