: గాంధీ ఆసుపత్రిలో ఘోరం... స్వైన్ ఫ్లూ తో బాలింత మృతి
సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాంతక వ్యాధి స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలింత ఈ రోజు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే, మరియమ్మ అనే మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధితో బాధపడుతూ గత వారం రోజులుగా గాంధీలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి నేడు ఆమె ప్రాణాలొదిలింది. ఈ నెల 1వ తేదీనే ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. చనిపోయిన మరియమ్మ మెదక్ జిల్లా వాసి. అయితే, మరియమ్మ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.