: నా సినిమాల్లో సామాన్యుడే హీరో: దర్శకుడు తేజ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివారి దేవాలయంలోని కనక దుర్గమ్మను దర్శకుడు తేజ నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తేజ విలేకరులతో మాట్లాడుతూ, తాను తీసే చిత్రాల్లో సామాన్యుడే కథానాయకుడని తెలిపారు. అందుకే తన సినిమాలకు జనాల్లో నుంచే హీరోని తీసుకుంటానని చెప్పారు. చాలా రోజుల తరువాత తేజ దర్శకత్వంలో రూపొందిన 'హోరాహోరీ' చిత్రం నేడు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. ఈ సందర్భంగానే ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.

More Telugu News