: బాడీగార్డులున్నది సపర్యలు చేయడానికేగా!: ఎమ్మెల్యే వితండవాదం

పదవుల్లో ఉన్న నేతలు, ఉన్నతాధికారులు తమ కింది ఉద్యోగులతో సపర్యలు చేయించుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చెప్పులు మోయించడం దగ్గర్నుంచీ... ఎన్నో ఘటనలు మనం చూశాం. కానీ, ఇది ఓ వెరైటీ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఛాంబ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కిషన్ లాల్, తన బాడీగార్డు భుజాలపై ఎక్కి అడుగు లోతు కూడా లేని పంట కాలువను దాటాడు. ఈ చిత్రాలు వెలుగులోకి వచ్చి విమర్శలు వెల్లువెత్తగా, దాన్ని ఆయన సమర్థించుకుంటున్నారు. అది తనకు అలవాటేనని చెబుతున్నారు. తనకు బాడీగార్డులను ఇచ్చింది సపర్యలు చేయడానికేగా? అని వితండవాదం చేస్తున్నారు. ఇలా వీపుపై ఎక్కి వెళ్లడం తనకు అలవాటేనని అంటున్నారు. తాను గతంలో డాక్టరుగా పనిచేశానని, అప్పుడు కూడా తన అవసరం ఉన్నవారు ఇలాగే వీపులపై మోసుకుంటూ తీసుకువెళ్లేవారని చెబుతున్న కిషన్ ను ఏమనాలి?

More Telugu News