: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్లకు చెందిన మహిళా ఫార్మాసిస్ట్ దుర్మరణం
అమెరికాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బాపట్లకు చెందిన మహిళా ఫార్మాసిస్ట్ బాలినేని మాధవి దుర్మరణం పాలయ్యారు. గత పదకొండేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్న మాధవి, బుధవారం రాత్రి ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. 2004లో విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన ఆమె, విద్యానంతరం అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని భర్తతో కలిసి ఆమె ఫ్లోరిడాలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మాధవి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.