: తెలంగాణ ఆర్టీసీకి రోజుకు కోటికిపైగా నష్టం: జేఎండీ రమణారావు
తెలంగాణ రహదారి రవాణా సంస్థకు రోజుకు కోటిన్నర రూపాయల నష్టం వస్తోందని ఆ రాష్ట్ర ఆర్టీసీ జేఎండీ రమణారావు తెలిపారు. ఈ క్రమంలో సంస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందస్సుకు రమణారావు, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ, సంస్థ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.