: ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమ్ నాథ్ భారతిపై కేసు నమోదైంది. భార్య పట్ల గృహ హింసకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఆయనపై అతని భార్య ఆరోపణలు చేసిన అనంతరం, ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. అయినా, ఫలితం దక్కకపోవడంతో కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఇదే గొడవకు సంబంధించి బెయిల్ కోసం సోమ్ నాథ్ భారతి కోర్టుకు వెళ్లారు. అయితే, కేసు నమోదు కాకుండానే బెయిల్ ఇవ్వడం తొందరపాటు అవుతుందని, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు కేసు నమోదు కావడంతో... బెయిల్ కోసం ఆయన మళ్లీ కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

More Telugu News