: సచివాలయంలో ప్రమాదం... ఎల్ బ్లాక్ పై నుంచి కింద పడ్డ కార్మికుడు
హైదరాబాదులోని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ప్రమాదం చోటుచేసుకుంది. సచివాలయంలో ఏపీకి కేటాయించిన ఎల్ బ్లాక్ పై నుంచి కార్మికుడు కింద పడ్డాడు. భవనానికి రంగులద్దేందుకు పైకి ఎక్కిన కార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది కార్మికుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నేపథ్యంలో సచివాలయంలో కలకలం రేగింది. తొలుత ఆత్మహత్యాయత్నమేమోనన్న అనుమానాలతో అక్కడి సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదవశాత్తు కార్మికుడు కిందపడ్డాడని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.